గోవా మాజీ సీఎం లుయిజినో ఫలేయిరోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. మాజీ సీఎం లుయిజినో సేవలు దేశానికి అవసరమని, తమ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తన ట్విట్టర్‌లో తెలిపింది.
నవంబర్ 29వ తేదీన పశ్చిమ బెంగాల్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. టీఎంసీ ఎంపీ అర్పిత్ ఘోష్ ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేశారు. ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఫలేయిరో వచ్చే వారం బెంగాల్‌లో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన ఫలేయిరో టీఎంసీలో చేరారు.