కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమంలో మరణించిన ఏడు వందల మంది రైతుల కుటుంబాలకు రూ.మూడు లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రశంసించింది.
రైతుల కుటుంబాలకు సాయం చేయడం చిన్న విషయం కాదని, రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం గొప్ప విషయమని వ్యాఖ్యానించింది. రైతుల నుంచి వడ్లను తక్షణమే కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసేందుకు నిరాకరించింది.