ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో వాస్తవంగా 116 ఓట్లు ఉండగా.. 239 ఓట్లు పడ్డాయి. దీన్నిబట్టి ఇతర పార్టీల ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వర రావుకు ఓటేశారని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 486 ఓట్లు రాగా.. ఆయన రాయలపై 247 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
