ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పంతం నెగ్గారు. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన గతంలో సవాల్ చేశారు.
ఇవాల్టి కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు వచ్చాయి. అయితే ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డి 762 ఓట్లు పొంది విజయం సాధించారు.