అఖండ విజయంతో మంచి జోష్ లో ఉన్న స్టార్ సీనియర్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణతో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన టాలీవుడ్ సంచలన దర్శకుడు కొరటాల శివ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,పుష్పతో అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ బన్నీలతో సినిమాలు పూర్తైన తర్వాత 2023లో బాలయ్య-కొరటాల ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. హీరోల ఇమేజ్లను బట్టి కథలు రాసే కొరటాల శివ.. బాలయ్య కోసం ఎలాంటి కథ రాశాడో చూడాలి మరి.