గతంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో ఆర్‌జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.60లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దాణా కుంభకోణం కేసులో ఈ నెల 15న లాలూను న్యాయస్థానం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.
కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దండోరా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసు చివరి కేసు.కేసుల్లో మొత్తం 170 మంది నిందితులు కాగా.. 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వానికి అప్రూవర్లుగా మారారు. మరో ఇద్దరు నేరాన్ని అంగీకరించగా.. ఆరుగురు పరారీలో ఉన్నారు.
రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూ సహా మొత్తం 99 మంది నిందితులపై ఫిబ్రవరి నుంచి విచారణ చేపట్టింది. 75 మందిని దోషులుగా నిర్ధారించగా.. 24 మందిని విడుదల చేసింది. ఇందులో 36 మందికి ఒక్కొక్కరికి మూడేళ్ల శిక్ష పడింది. మిగతా నిందితులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టు శిక్షణ ఖరారు చేస్తున్నది.