అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయినాక సమంత రెచ్చిపోతుంది. తనను ఎవడు ఆపేదంటూ ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది ఈ హాట్ బ్యూటీ.. ఈ అందాల రాక్షసి ఐటెం సాంగ్ లో నటించి మెప్పించిన పాట ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ .
అల్లు అర్జున్ హీరోగా.. అందాల రాక్షసి.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. అనసూయ,సునీల్ ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ పుష్పలోనిది ఈ పాట. ఈ పాట వచ్చి నాలుగు నెలలు అయిన క్రేజ్ తగ్గలేదు. ఆ సాంగ్ లో సమంత స్టెప్పులు అంతగా ప్రేక్షకుల మదిని ముఖ్యంగా మాస్ ఆడియన్స్ మదిని దోచుకున్నాయి.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఎంత వివాదస్పదమైందో అంత సంచలనం సృష్టించింది. యూట్యూబ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఆ ప్లాట్ ఫాం ఈ ఫ్లాట్ పాం అనేది లేకుండా అన్నింటిలోనూ వైరల్ అయి అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ పాట. అయితే అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రతి మార్చిలో ‘అల్ర్టా మయామి’ పేరుతో గ్రాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.ఈ క్రమంలో తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో ‘ఊ అంటావా.. మావ’ పాటను ప్రదర్శించారు. ఆ వీడియో సమంత సోషల్ మీడియాలో షేర్ చేసారు. ‘మా సినిమాకు చాలా గొప్ప రీచ్ ఇది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టాటస్‌లో పోస్ట్ చేసింది.
#OoAntavaOoOoAntava at Ultra Miami.. Incredible reach to say the least.. Pan India ah bokka @alluarjun. Pan world.. #Pushpa.. At the biggest music festival in the world.. @PushpaMovie pic.twitter.com/sq6Bf6E9sn
— . (@urstrulyaaykayj) March 27, 2022