Home / ANDHRAPRADESH / వామ్మో.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో రూ.10 కోట్ల క్యాష్‌.. 10 కేజీల గోల్డ్‌!

వామ్మో.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో రూ.10 కోట్ల క్యాష్‌.. 10 కేజీల గోల్డ్‌!

ఏపీలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పేపర్లు చూపించకపోవడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఉభయ గోదావరి జల్లాల్లో ఈ తనిఖీలు జరిగాయి.

తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం సమీపంలో హైవేపై పోలీసులు ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న రెండు ట్రావెల్స్‌ బస్సులను చెక్‌ చేశారు. ఆ బస్సుల్లో రూ.5కోట్ల 60లక్షల క్యాస్‌, 10 కేజీల 10 గ్రాముల గోల్డ్‌ దొరికింది. విజయవాడకు చెందిన ఇద్దరు వ్యాపారులు ఎలాంటి బిల్లులు లేకుండా వీటిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి వద్ద కూడా ఈ ఉదయం పోలీసుల తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో ఓ ట్రావెల్స్‌ బస్సులో సుమారు రూ.5కోట్ల క్యాష్‌, సుమారు 350 గ్రాముల బంగారం లభించింది. ఆ బస్సు విజయనగరం నుంచి గుంటూరు వెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum