‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన కన్నడ చిన్నది శ్రీలీల. ఈ యంగ్ బ్యూటీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్ళిసందD’ చిత్రంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరింది.
ప్రస్తుతం తెలుగులో శ్రీలీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా’ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాలో నటిస్తోంది.
ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి బ్యానర్‌లో గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలోనూ ఈ బ్యూటీనే హీరోయిన్. యూత్ స్టార్ నితిన్ – దర్శక, రచయిత వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో కూడా శ్రీలీలని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ హీరో అయిన ఆశిష్ రెండో సినిమా ‘సెల్ఫిష్’లో హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఇవి కాక మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయట.