మంత్రి పదవి విషయంలో మాట్లాడిన మాటలు ఆవేశంతో అన్నవే తప్పించి తన మనసులో నుంచి రాలేదని పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఇటీవల ఏపీ కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాబూరావు మాట్లాడారు.
మంత్రి పదవి విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. నియోజకవర్గ ప్రజల కోసం అవసరమైతే అహింసావాదాన్ని వీడి హింసావాదంలోకి వెళ్తానంటూ తాను మాట్లాడిన మాటలపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. త్యాగాలు చేయడం, అధర్మాలను ఎదిరించడంలో తానెప్పుడూ ముందే ఉంటానని గొల్ల బాబూరావు అన్నారు.