హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా… కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున విడుదల కానున్న చిత్రం ఆచార్య.
ఈ చిత్రం గురించి చేస్తున్న ప్రమోషన్ లో భాగంగా కొరటాల శివ పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలు ఇచ్చారు. ఈ ఇంటర్వూ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జూనియర్ కెరీర్ లో ముప్పై సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించనున్న నటినటులను ఇతర సిబ్బందిని ఎన్టీఆర్ పుట్టిన రోజు మే28న ప్రకటించనున్నట్లు తెలిపారు.
జూన్ నెల నుండి ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్యక్రమం మొదలు కానున్నది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్టు నటించనున్నారా అనే అంశం గురించి కొరటాల శివ క్లారిటీచ్చారు. ఇందులో నటించనున్న హీరోయిన్ ఇంకా కన్ఫార్మ్ కాలేడు అని ఆయన క్లారిటీచ్చారు..