Home / SLIDER / ఐక్యతకు నిదర్శనం ఇఫ్తార్

ఐక్యతకు నిదర్శనం ఇఫ్తార్

జగిత్యాల జిల్లా ధర్మపురి కేంద్రంలో 30 లక్షల తో నూతనంగా నిర్మించిన షాదిఖానా ను ప్రారంభించి, రంజాన్ పర్వదినాన్ని పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిరుపేద ముస్లిం సోదరులకు గిఫ్ట్ ప్యాక్ పంపిణీ, అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియోజకవర్గం స్థాయి ముస్లిం సోదరులకు ఇచ్చిన దావత్ ఏ ఇఫ్తార్ విందుకు హాజరైన తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ మత సామరస్యానికి పెట్టింది పేరని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తున్నారన్నారు.రంజాన్‌ పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. మసీదులు, ఈద్గాల అభివృద్దికి, మరమ్మతులకు నిధులిస్తున్నామన్నారు. పేదలకు దుస్తుల పంపిణీతోపాటు ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.

పవిత్ర రంజాన్ మాసం మహోన్నతమైన​దని పేర్కొన్నారు. ముస్లీం సోదరులు తమ నిత్య ప్రార్థనల లో మత సమైక్యతతో పాటు దేశ సమగ్ర అభివృద్ధి కై భగవంతున్ని కోరుకోవాలని చెప్పారు.కటినమైన ఉపవాస దీక్షల ద్వారా వ్యక్తి గత క్రమశిక్షణ అలవడుతుందన్నారు.అల్లా ఆశీస్సులు ప్రతీ ఒకరి పై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపిన మంత్రి రాష్ట్రం లో అన్ని మతాలకు అనుగుణంగా సందర్భాన్ని బట్టి ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించడం అనేది దేశం లొ తెలంగాణ రాష్ట్రం లొ మినహా మరెక్కడా లేదన్నారు.రంజాన్ పండుగలో ప్రభుత్వ భాగస్వామ్యం, ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా, ప్రభుత్వ ఇఫ్తార్ విందులు ఘనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇఫ్తార్ విందు కు వచ్చిన ప్రతీ ముస్లీం సోదరుడి కి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు..

ఇందులో డిసిఎంఎస్ ఎల్లాల చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్ గారు, బత్తిని అరుణ గారు, ఎంపీపీ చిట్టిబాబు గారు, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ గారు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయ్యో రాజేష్ గారు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు, మండల కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat