మధుమేహంతో బాధపడేవారు వ్యాయామంతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. పాత బియ్యం, గోధుమలు, పాలిష్ తక్కువగా చేసిన బియ్యం, సజ్జలు, జొన్నలు తీసుకోవాలి. కాయగూరలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం తినాలి. పాలు, పాలు పదార్థాలు, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, ఆపిల్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఉప్పు, చక్కెర బాగా తగ్గించాలి. రాగి జావ, రొట్టె తింటే మంచిది.
