ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని.. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్‌తో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌కోఆర్డినేటర్ల సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని జగన్ ఆదేశించారన్నారు.
వచ్చే నెలలో ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాలను తిరిగి సమస్యలను అక్కడి బుక్‌లో రాయాలని.. వాటిని తాను పరిష్కరిస్తానని సీఎం చెప్పినట్లు నాని తెలిపారు. త్వరలోనే జగన్ జిల్లాల పర్యటనకు వస్తారన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం సర్వే చేయించారని.. అందులో కొంతమంది గ్రాఫ్ పడినట్లు తెలిసిందని వివరించారు. ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలని జగన్ సూచించారన్నారు. వారి పనితీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చుతామని సీఎం తేల్చి చెప్పినట్లు కొడాలి నాని తెలిపారు. 65 శాతం ప్రజలు తిరిగి జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని.. ఈ విషయం సర్వేలో తేలిందన్నారు..