Home / ANDHRAPRADESH / క్విట్‌ ఏపీ.. క్విట్‌ మంగళగిరి అని వాళ్లిద్దరినీ పంపించేశారు: వైవీ సుబ్బారెడ్డి

క్విట్‌ ఏపీ.. క్విట్‌ మంగళగిరి అని వాళ్లిద్దరినీ పంపించేశారు: వైవీ సుబ్బారెడ్డి

కరోనా సమయంలోనూ సీఎం జగన్‌ ప్రజలపై ఆర్థికభారం పడకుండా కాపాడారని టీటీడీ ఛైర్మన్‌, ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జగన్‌ పాలన చూసి మూడేళ్లుగా నిద్రపోయిన చంద్రబాబు, లోకేశ్‌ ఇప్పుడు బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు.

ఏపీకి సీఎంగా జగన్‌ ఉన్నారంటే అది వైసీపీ కార్యకర్తల సహకారమేనని చెప్పారు. 2014- 2019 వరకు చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అధోగతి పాలైందన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను జగన్‌ గుర్తించి 98 శాతం అమలు చేశారన్నారు. చంద్రబాబుది ఐరన్‌లెగ్‌ అన్నారు. అందుకే ప్రజలు క్విట్‌ ఏపీ అని చంద్రబాబును.. క్విట్‌ మంగళగిరి అని లోకేశ్‌ని తిప్పి పంపించారని చెప్పారు. మే 11 నుంచి గడపగడపకు వైసీపీ కార్యక్రమం మొదలవుతుందని సుబ్బారెడ్డి తెలిపారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum