తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన లాయర్ ద్వారా కేటీఆర్ నోటీసుల పంపారు. కావాలనే బండి సంజయ్ అబద్ధాలు చెబుతున్నారని.. ఇంటర్ విద్యార్థుల సూసైడ్ ఘటనలను కేటీఆర్‌కు ఆపాదిస్తున్నారని ఆయన తరఫు లాయర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకే నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. 48 గంటల్లో కేటీఆర్‌కు సారీ చెప్పాలని.. లేకపోతే క్రిమినల్, సివిల్ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.
