తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజశేఖర్ హీరోగా, జీవిత దర్శకత్వం వహించిన ‘శేఖర్’ మూవీ ఈనెల 20 విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ ..స్టార్ హీరో చిరంజీవితో విభేదాలపై జీవిత రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘మాకు ఎవరితోనూ ఇష్యూ లేదు. చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ యూట్యూబ్ వారే థంబెనెయిల్స్ పెట్టి మామధ్య ఇంకా దూరం పెంచుతున్నారు’ అని అన్నారు. మనసున్న ప్రతిఒక్కరికి ‘శేఖర్’ నచ్చుతాడన్నారు.