ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశం కల్పించారు. అనూహ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను వైసీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, ప్రముఖ న్యాయవాది నిరంజన్‌రెడ్డికి ఆ పార్టీకి అధినేత, సీఎం జగన్ ఎంపిక చేశారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం కల్పించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎంతో సమావేశమైన అనంతరం రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. సీఎం జగన్‌కు బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్‌కాదని.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అని సజ్జల చెప్పారు. మూడేళ్ల వైసీపీ పాలనలో అన్నింటా సామాజిక న్యాయాన్ని జగన్ పాటించారన్నారు.