బీసీసీఐ అధ్యక్షుడు,టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ కోల్ కత్తాలో భారీ బంగ్లాను కొనుగోలు చేశాడు.
దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 10,280 చదరపు అడుగులు కలిగిన ఈ బంగ్లాను భార్య డోనా, కూతురు సనా, తల్లి నిరూపమ్ పేరిట సమానంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. 48 ఏళ్ల తర్వాత పూర్వీకుల ఇంటి నుంచి గంగూలీ త్వరలోనే కొత్తగా కొన్న భవనంలోకి మారనున్నాడు.