ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 నుంచి వారం రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగినట్లు సమాచారం.
సభలో ప్రవేశపెట్టే బిల్లుల అంశాన్ని గవర్నర్ దృష్టి సీఎం తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని అంశాలతో పాటు కోనసీమ అల్లర్లపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను గవర్నర్‌కు సీఎం జగన్ వివరించినట్లు సమాచారం. దీంతో పాటు ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటన, ఇతర అంశాలను గవర్నర్ వద్ద చర్చించినట్లు తెలిసింది.