ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించిన సంగతి విదితమే.. ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రాపై ప్రసంశలు వస్తున్నాయి. ‘కోచ్ మనసు పెట్టి పనిచేశాడు. తన ఆటగాళ్ల గురించి, వాళ్లకు ఏ విధంగా సాయం చేయాలనే దాని గురించి తెగ ఆలోచిస్తుంటాడు. వ్యూహాల పరంగా IPLలో అత్యుత్తమ కోచ్లలో అతడు ఒకడు. ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చేసేలా వాళ్లతో మాట్లాడుతుంటాడు. ప్రచారం కోరుకోడు. తెరవెనుక ఉంటాడు’ అని GT మెంటార్ కిర్టన్ అభినందించాడు.