Site icon Dharuvu

ఇండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్‌.. కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

ఇండియాలో సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టు ఖరారైంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. రిషబ్‌ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఢిల్లీలో రేపు తొలి మ్యాచ్‌ జరగనుండగా.. 12న కటక్‌, 14న వైజాగ్‌, 17న రాజ్‌కోట్‌, 19న బెంగళూరులో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి.

రిషబ్‌ పంత్ సారథ్యంలోని జట్టులో హార్దిక్‌ పాండ్య, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌, దినేష్‌ కార్తిక్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ఖాన్‌, అర్షదీప్‌సింగ్‌,ఉమ్రాన్‌మాలిక్‌ తదితరులు ఉన్నారు.

Exit mobile version