తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవి- ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా లేటెస్ట్ చిత్రం భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ చిరు చెల్లిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనున్నది.. అయితే మెగాస్టార్ కు జోడీగా మిల్క్ బ్యూటీ.. హాటెస్ట్ హీరోయిన్ తమన్నా నటిస్తోంది.
ఇందులో ఓ యువ నటుడికి అవకాశముంది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడా పాత్ర కోసం మెగా ఫ్యామిలీకి భక్తుడైన యంగ్ హీరో అయిన నితిన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. సినిమాకి ఎంతో కీలకమైన పాత్ర ఆయనదని, కీర్తికి జోడీగా కనిపించే అవకాశముందని ఫిల్మ్ నగర్లో ఈ వార్త తెగ ప్రచారం వినిపిస్తోంది. అన్నాచెల్లి అనుబంధాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది అని టాక్.