బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఆసుపత్రిలో చేరిందని తెలియడంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమెకు టాచీ కార్డియా అనే సమస్య ఎదురైందట. అంటే.. హఠాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం. ఒత్తిడి, మానసిక సంఘర్షణలు, అతి వ్యాయామం, కెఫీన్ అధికంగా తీసుకోవడం, హర్మోన్ సమస్యలు వంటి కారణాల వల్ల సమస్య వస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రభాస్ ‘ప్రాజక్టు కె’ షూటింగ్ కోసం దీపిక హైదరాబాద్‌లోకి వచ్చింది.
