ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా అరిగెలవారిపేటలో వరద బాధితులతో జగన్ మాట్లాడారు.
వరదల సమయంలోనే తాను వచ్చి ఉంటే అధికారులంతా తన చుట్టే తిరిగేవారని.. అందుకే వారికి కొంత సమయం ఇచ్చి ఇప్పుడొచ్చానని చెప్పారు. అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పెదపూడిలంక వద్ద బ్రిడ్జి నిర్మిస్తామని అక్కడి ప్రజలకు జగన్ హామీ ఇచ్చారు. సీజన్ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. కాలినడకనే సీఎం తన పర్యటనను కొనసాగిస్తున్నారు.