Breaking News
Home / MOVIES / ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎవరి పాత్ర హైలైట్‌? పరుచూరి ఏం చెప్పారంటే..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎవరి పాత్ర హైలైట్‌? పరుచూరి ఏం చెప్పారంటే..

జక్కన్న ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చి రికార్డులు సృష్టించిన మూవీ ‘ర్‌ఆర్‌ఆర్‌.’ ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పోటీపడి నటించారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ తమ పాత్రల్లో అదరగొట్టేశారు. అయితే ఈ సినిమాలో ఎవరి పాత్ర ఎక్కువ.. ఎవరిది తక్కువ అనే దానిపై ఫ్యాన్స్‌ చర్చలకు తెరలేపారు. ఎవరికి అనుకూలంగా వారు తమ అభిప్రాయాలను చెప్పారు.

మరోవైపు దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్‌ ఛానల్‌లో స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌ పాత్ర చిన్నగా ఉందంటూ ప్రేక్షకులు కొంతమంది అంటున్నారని.. పాత్ర నిడివి కంటే అది ప్రేక్షకుల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిందనేది ముఖ్యమని చెప్పారు.

పెదరాయుడు సినిమాలో రజనీకాంత్‌ పాత్ర ఉన్నది కాసేపే అయినా దాని ఇంపాక్ట్‌ చాలా ఎక్కువగా ఉండేదని గుర్తుచేశారు. రామ్‌చరణ్‌ పాత్ర కాస్త ఎక్కువే అయినా రెండు పాత్రలనూ దర్శకుడు రెండు కళ్లలా భావించారని పరుచూరి చెప్పారు. ఈ సినిమాలో తాను రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లను చూడలేదని.. కేవలం అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌నే చూశానన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino