అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా స్టార్ డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ(477) రెండో స్థానానికి ఎగబాకాడు. విండీస్‌తో నాలుగో టీ20లో మూడు సిక్సర్లు బాదడంతో ఈ ఘనత సాధించాడు.
తొలిస్థానంలో క్రిస్ గేల్(553) ఉండగా, అఫ్రిదీ(476) మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత మెక్కల్లమ్ (398), గప్టిల్ (379), ధోనీ (359), జయసూర్య (352), మోర్గాన్(346), డివిలియర్స్(328) ఉన్నారు.