సోదరులకు కట్టే రాఖీలు కొనేందుకు అమ్మాయిలు చాలా కష్టపడుతుంటారు. డిజైన్లు, రంగులు.. ఇలా చాలానే చూస్తారు. కొందరైతే వెండి, బంగారు రాఖీలు కొంటారు. కానీ నూలు దారం, దూది లేదా దారాలతో కలిపి చేతితో చేసిన రాఖీ కట్టడం మన సంప్రదాయమని పండితులు చెబుతున్నారు. పండుగ ఇలాగే మొదలైందట. ప్లాస్టిక్ షీట్లు, రంగుల్లోని రాఖీల ధర ఎక్కువేకాక అవి పర్యావరణానికి హాని చేస్తాయి. అయినా రాఖీ భావన రంగుల్లో కాదు మన మనసుల్లో ఉండాలి.
