Home / SLIDER / పాకిస్తాన్ వర్సెస్ అప్గానిస్తాన్ మ్యాచ్ లో బాహాబాహీకి దిగిన ఆటగాళ్లు

పాకిస్తాన్ వర్సెస్ అప్గానిస్తాన్ మ్యాచ్ లో బాహాబాహీకి దిగిన ఆటగాళ్లు

నిన్న జరిగిన పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు బాహాబాహీకి దిగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జోరు మీదున్న పాక్ బ్యాటర్ అసిఫ్ అలీని ఔట్ చేయడంతో బౌలర్ ఫరీద్ అహ్మద్ సంబరాలు చేసుకున్నాడు. ఆవేశంలో ఏదో అనగానే అసిఫ్ అలీ కోపంతో అతడి దగ్గరకు వచ్చి బ్యాట్తో బెదిరించాడు.

కొట్టేస్తా అన్నట్లు ముందుకు కదిలాడు. అంపైర్, సహచర ఆటగాళ్లు వచ్చి వాళ్లిద్దరినీ సముదాయించి, పంపించేశారు.అయితే  హోరాహోరీగా సాగిన పోరులో పాక్‌ ఒక వికెట్‌ తేడాతో అఫ్గాన్‌పై గెలుపొందింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.

ఇబ్రహీం (35) టాప్‌ స్కోరర్‌ కాగా.. పాక్‌ బౌలర్లలో రవుఫ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఛేదనలో పాకిస్థాన్‌ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. షాదాబ్‌ ఖాన్‌ (36), ఇఫ్తిఖార్‌ (30) రాణించారు. చివరి ఓవర్‌లో విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో పాక్‌ పేసర్‌ నసీమ్‌ షా (14 నాటౌట్‌) వరుస బంతుల్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat