Site icon Dharuvu

పంజాబ్ సీఎం కు ఢిల్లీ సీఎం మద్ధతు

పంజాబ్ సీఎం అయిన భగవంత్ కు ఆప్ ఆధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్  కేజ్రివాల్ మద్దతుగా నిలిచారు. ఇటీవల  జర్మనీ దేశం  నుంచి  ఢిల్లీ వస్తుండగా తప్పతాగి ఉండటంతో పంజాబ్ సీఎం భగవంత్ ను తాను ప్రయాణిస్తోన్న  విమానం నుంచి దించేశారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ సందర్భంగా  ఖండించారు.

‘పంజాబ్ రాష్ట్రంలో గత  75 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని మంచి పనులను ముఖ్యమంత్రిగా  భగవంత్ చేశారు. రాష్ట్రానికి అసలు సిసలైన నిఖార్సయిన ముఖ్యమంత్రి దొరికారు. ఆయన చేసే పనిలో లోపాలు ఎంచలేక ఇలా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. విపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు’ అని ఆయన ఈ సందర్భంగా  తెలిపారు.

Exit mobile version