టాప్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమె మూవీ రిలీజ్ డేట్ వెల్లడైంది. సమంత ముఖ్యపాత్రలో నటించిన ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ‘శాకుంతలం’ రూపొందుతోంది. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ నటించారు.
గతంలో రిలీజ్ చేసిన మూవీ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా సమంత అందాల కట్టిపడేశాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తవగా.. రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్‌ను ‘శాకుంతలం’ టీమ్ ప్రకటించింది. నవంబర్ 4న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలు గుణ టీమ్ వర్క్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించాయి. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాయి.