ఓ వ్యక్తి నోట్లో నుంచి భారీ పన్నును బయటకు తీశారు వైద్యులు. గంటన్నర సేపు ఆపరేషన్ చేసి 37.5 మిల్లీమీటర్లు పొడవు ఉన్న దంతాన్ని తొలగించారు. గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకోనున్న ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని బడ్గామ్ జిల్లాలో జరిగింది.
బడ్గామ్ జిల్లాలోని ఓ వ్యక్తి 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎస్డీహెచ్ బీడ్‌వా హాస్పిటల్లో చేరాడు. దీంతో అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. భారీ దంతం ఉండడం వల్లే తీవ్ర నొప్పితో బాధపడినట్లు వెల్లడించారు. ఆయన అనుమతితో శనివారం గంటన్నర శ్రమించి 37.5 మిల్లీమీటర్ల పన్నును బయటకు తీశారు.
గిన్నీస్ బుక్‌లో చోటు
ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన పన్ను సైజు 37.2 మిమీగా నమోదైంది. ప్రస్తుతం బయటకు తీసిన ఈ పన్ను 37.5గా ఉండడంతో గిన్నీస్లో చోటు దక్కించుకోనుంది.