తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే యూనిక్ దర్శకులలో ఒకడు సాయి రాజేష్ .. ప్రస్తుతమున్న తెలుగు సినిమాలకు .. రొటీన్‌కు భిన్నంగా సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఒకవైపు మెగాఫోన్ పట్టుకుని సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగా మంచి మంచి కథాంశాలతో సరికొత్త సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో మెరుపువేగంతో దూసుకుపోతున్నాడు.
ఇటీవలే సాయి రాజేష్ నిర్మించిన ‘కలర్ ఫోటో’ సినిమాకు ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు వచ్చింది. ప్రస్తుతం సాయి రాజేష్ ‘బేబి’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి, ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మిస్తున్నాడు.
అయితే తాజాగా సాయి రాజేష్‌కు, మారుతి కాస్ట్లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇటీవలే ‘బేబి’ సినిమా ఫైనల్ కాపీని చూసిని మారుతి చాలా ఇంప్రెస్ అయి.. సాయి రాజేష్‌కు ‘MG Hector Plus’ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ కారు ధర సుమారు రూ.25 లక్షల వరకు ఉండనుంది. దీనిపై సాయి రాజేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘బాగా తీసా అని ఇష్టమో..హిట్ కొట్టాల్సిందే అని బ్లాక్ మెయిలో.. నా సినిమా నిర్మాతలు కారును గిప్ట్‌గా ఇచ్చారు. నా గురూజీ మారుతి, నా ఫ్రెండ్ ఎస్‌కేఎన్‌కు లవ్ యూ’ అంటూ ట్వీట్ చేశాడు.