Home / NATIONAL / గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలు ఇవే.!

గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలు ఇవే.!

సూర్యగ్రహణం పూర్తవుతోంది. సాయంత్రం 5.03 నిమిషాలకు ప్రారంభమైన పాక్షిక సూర్యగ్రహణం.. 5.45 గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలను చూద్దాం.

గ్రహణం పూర్తవగానే ఇంట్లోని వారంతా విడుపు స్నానం చేయాలి. ఈ నియమాన్ని అందరూ కచ్చితంగా పాటించి తలంటుకోవాలి.

పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలు, విగ్రహాలను శుద్ధి చేయాలి. దానితో పాటు వంటకాలు, ఇంట్లోని వస్తువులపై ఉంచిన దర్భ గడ్డిని తీసేయాలి.

స్నానమాచరించిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అన్ని గదులనూ కడగడం శ్రేయస్కరం. అనంతరం దేవునికి దీపారాధన చేసి దోషాలను పరిహరించుకోవాలి.

గ్రహణానికి ముందు నిల్వ ఉంచిన పాలు, పెరుగు, మజ్జిగ, ఆవకాయ వంటి పదార్థాలు యథావిథిగా వినియోగించవచ్చు. వాటిపై దర్భలను ఉంచడం మంచిది.

ఈ గ్రహణం.. ముఖ్యంగా తులా రాశి వారికి ఉంటున్నందున ఆ రాశి వారు ప్రత్యేక దోష పరిహారాలను పాటించాలి. ముఖ్యంగా స్వాతి, విశాఖ నక్షత్రం గల వ్యక్తులు దానాలు చేయడం, హోమాధికాలను నిర్వహిస్తే మంచిదని ఆధ్యాత్మక వేత్తలు సూచిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat