తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన నటి హాన్సిక త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న సంగతి విదితమే. తన చిన్ననాటి స్నేహితుడు అయిన సోహైల్ ను వచ్చే నెల జైపూర్ వేదికగా ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఒకటి కాబోతుంది ఈ జంట. వీరిద్దరూ గత కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వీరి పెళ్ళి కి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. అయితే వీరి పెళ్ళికి ముందు రెండు రోజుల నుండే మెహందీ,సంగీత్ వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెల్సింది. అయితే తాజాగా ఓ వార్త మీడియాలో వైరల్ అవుతుంది. వీరి పెళ్ళి వేడుక కార్యక్రమం ఆన్ లైన్ ఫ్యాట్ ఫారమ్ అయిన ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెల్సింది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో భారీ డీల్ కుదిరించుకున్నట్లు సమాచారం.