నయనతార.. ఈ పేరు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ అని లేకుండా సినిమా ఇండస్ట్రీలోనే తరచుగా విన్పిస్తోన్న పేరు. రోజుకో కాంట్రవర్సీలో నయన చిక్కుకుంటూనే ఉంది. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణం నుంచి మొదలుపెడితే పెండ్లి, సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం వరకు అన్నీ ఏదో వివాదాన్ని సృష్టిస్తూనే వచ్చాయి.
అయితే ఎప్పుడూ ఏదోక కాంట్రవర్సీలో ఉండే నయనతార గురించి ఆమె అత్త, విఘ్నేశ్ శివన్ తల్లి మీనా కుమారి షాకింగ్ విషయాలు చెప్పింది.తన కోడలు నయనతార మనస్సు చాలా గొప్పదని మీనాకుమారి పొగడ్తలతో ముంచెత్తింది. తన కొడుకు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అని.. కోడలు స్టార్ హీరోయిన్ అని.. వాళ్లిద్దరూ ఎంతో కష్టపడి పనిచేస్తారని చెప్పుకొచ్చింది. తన కొడుకు, కోడలు ఇద్దరూ కష్టపడి పనిచేయడమే కాదు.. కష్టపడి పనిచేసేవాళ్లను కూడా అంతే గౌరవిస్తారని పేర్కొంది.
తన కొడుకు ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు ఉంటారని చెప్పింది. అయితే వారిలో ఒకరికి 4 లక్షల వరకు అప్పు ఉందని తన కోడలు నయన్‌కి తెలిసిందట. వెంటనే ఆ పని మనిషికి రూ.4లక్షలు డబ్బు ఇచ్చి బాకీలు కట్టేయమని చెప్పిందట. ఈ విషయాన్ని విఘ్నేశ్ శివన్ తల్లి మీడియా ముందు బయటపెట్టింది.