Home / MOVIES / సోనూ చేసిన పనికి నెటిజన్లు ఫిదా

సోనూ చేసిన పనికి నెటిజన్లు ఫిదా

హరియాణాలో హిసార్ జిల్లా ఖరక్ పునియా గ్రామానికి చెందిన సారంగి వాయిద్యకారుడు మమన్‌ ఖాన్‌ (83) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇంద్రజిత్‌ బర్కే అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

మమన్‌ ఖాన్‌ అనారోగ్యంతో ఉన్న ఫొటోను సైతం పోస్టుకు జతచేసి.. ఆర్థిక పరిస్థితిని వివరించాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన రియల్‌ హీరో అతనికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. “ఖాన్ సాహిబ్, మొదట మీ ఆరోగ్యం నయం చేస్తా. ఆ తర్వాత మీ సారంగి పాట వింటా” అని రీట్వీట్ చేశారు. అయితే మమన్ ఖాన్ తన సంగీతంతో దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాదు హరియాణా ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat