Home / ANDHRAPRADESH / వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర తప్పిన ప్రమాదం

వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర తప్పిన ప్రమాదం

ఏపీలోని ఏలూరు జిల్లాలోని  చింతలపూడి నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు.. అధికార వైసీపీకి చెందిన నేత  వున్నమాట్ల రాకడ ఎలీజా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

రాష్ట్రంలోని కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్థంభానికి ఢీ కొట్టింది. అయితే కారులో బెలూన్లు ఓపెన్ అవ్వడంతో ఎలీజా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యేతో పాటు కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎమ్మెల్యే వేరే వాహనంలో జంగారెడ్డిగూడెం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ప్రమాదంలో ఎమ్మెల్యే ఎలీజా సురక్షితంగా బయటపడటంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat