ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు విదేశాలలో కూడా ఘనంగా జరుగుతున్నాయి.
గల్ఫ్ దేశాలలో వైఎస్ఆర్‌సీపీ అభిమానులు తమకు వీలయిన చోట్ల అభిమానంతో తమ ప్రియనేత జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దుబాయిలోని వైఎస్ఆర్‌సీపీ అభిమానులు బుధవారం జగన్ జన్మదినోత్సవ వేడుకలను సందడిగా నిర్వహించారు.
గల్ఫ్ దేశాలలో స్ధానిక అరబ్ ప్రజలకు ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల తరహా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అందిస్తున్నారని, ఈ సంక్షేమ పాలన ఇదే తరహా కొనసాగాలని కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త సత్తి ప్రసన్న సోమిరెడ్డి అకాంక్షించారు.