AYYANNAPATRUDU: తెదేపా నేత అయ్యన్నపాత్రుడిపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
రాబోయే ఎన్నికల్లో తెదేపా చిరునామా గల్లంతు కావడం ఖాయమన్నారు. ఓడిపోతామనే భయంతోనే మాట్లాడుతున్నారని అన్నారు. అయ్యన్నపాత్రుడు తన భాషను మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యలు చేశారు.
అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడి చరిత్ర అందరికీ తెలుసని….నర్సీపట్నాన్ని గంజాయి అడ్డాగా మార్చిన చరిత్ర ఆయనదని విమర్శలు గుప్పించారు. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.