YCP: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైకాపా నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే వెంకటగిరిలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
ఆనంను సొంత తమ్ముడే తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆనం చెప్పారని అన్నారు. అప్పటినుంచి జరిగితే అప్పుడే చెప్పాలి గానీ ఇప్పుడెందుకు గావుకేకలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఎప్పటినుంచే లోలోపల కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ తెదేపాతో పొత్తులు కుదుర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆనంకు ముసలితనం వచ్చి బుద్ధి గాడి తప్పిందని ఎద్దేవా చేశారు. విశ్వాసం లేకుండా అన్నం తినే ఇంటికే కన్నం పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆనంను అధిక మెజారిటీతో గెలిపించామని రాంకుమార్ రెడ్డి అన్నారు. వెంకటగిరి నక్సల్ ఏరియా అని ఆనం అన్నారని గుర్తు చేశారు. ఆనం తప్పులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.