Home / NATIONAL / సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు

 దేశ అత్యున్నత న్యాయ స్థానమైన  సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి నియామకాలకు ఎట్టకేలకు నిన్న శనివారం ఆమోదం తెలిపింది.

ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్విట్టర్‌లో వెల్లడించారు. కొలీజియం సిఫారసులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మీద సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒకరోజు తర్వాతనే తాజా నియామకాలకు ఆమోదముద్ర వేయడం గమనార్హం.

కొత్తగా నియమితులైన వారిలో తెలుగు వ్యక్తి జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మణిపూర్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్నారు. రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్‌ మిత్తల్‌, పాట్నా హైకోర్టు సీజే జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎహసానుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాకు కూడా సుప్రీం జడ్జీలుగా పదోన్నతి లభించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino