త్వరలో రైతుబంధు కింద పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈనెల 28 నుంచి అకౌంట్లలో వేయాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్‌ను కేసీఆర్ ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి క్రమంగా ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారికి రైతుబంధు జమ చేస్తారు. రైతుబంధు కోసం వానాకాలం సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,600 కోట్ల సాయం …
Read More »వావ్.. హర్భజన్ గొప్ప మనసు.. ఎందుకో తెలుసా?
క్రికెటర్‌గా ఎంతో కీర్తి గడించిన హర్భజన్ సింగ్ ఇటీవల రాజకీయాల్లో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచీ సేవా భావం ఉన్న భజ్జీ ఇవాళ మళ్లీ గొప్ప మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. దేశం కోసం ఏదైనా చేస్తానంటూ ట్వీట్ చేసిన హర్భజన్.. రాజ్యసభ ఎంపీగా తనకొచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు, వాళ్ల సంక్షేమానికి వెచ్చిస్తానని ప్రకటించాడు. …
Read More »విద్యుత్ ఛార్జీలు మన దగ్గరే తక్కువ- రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చేదీ తెలంగాణ మాత్రమే
మానవ దైనందిన జీవితంతో పెనవేసుకుపోయిన అత్యంత కీలక అంశం విద్యుత్తు. కరెంటు సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా జన ప్రవాహం ఎక్కడికక్కడ స్తంభించిపోయేంతగా విద్యుత్ అవసరాలు పెరిగిపోయాయి. అంతటి ప్రాధాన్యం గల విద్యుత్తు ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజల, రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది.రెండు, మూడు విడుతల 6 గంటల విద్యుత్తుతో నాడు వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. గృహ, వాణిజ్య వినియోగదారులు గంటల తరబడి అంధకారంలో జీవించారు. 2, …
Read More »నేటి నుండి రైతుబంధు సాయం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం అమలులో భాగంగా 8వ విడత నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి జమ చేస్తారు. గతంలో మాదిరిగానే రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ, 10 రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,645.66 కోట్లు విడుదల చేసింది. ఈసారి 66,61,638 మంది రైతులకు లబ్ధి …
Read More »రైతులు చనిపోయారా.. మాకు తెలియదే మా దగ్గర రికార్డులే లేవు
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనోద్యమంలో రైతులు చనిపోయిన విషయం తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. రైతుల మరణాలపై తమ దగ్గర రికార్డులేమీ లేవని తెలిపింది. కాబట్టి వారికి ఆర్థిక సాయం చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. ‘ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సాయం అందజేస్తారా’ అని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ …
Read More »ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కుట్ర
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రుద్దిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం రైతులను బాధల సుడిగుండంలోకి నెట్టేసింది. ఆధార్ నంబర్‌తో ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేయని రైతుల ధాన్యం కొనవద్దని కేంద్రం ఆదేశించడంతో అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ నిబంధన కారణంగా చాలామంది రైతులు సకాలంలో ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. …
Read More »రైతులపై కార్లను ఎక్కించిన కేంద్ర మంత్రి తనయుడు
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాక సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై రైతులు లఖింపురి ఖీరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లడంతో …
Read More »వేరుశనగ పంటను ప్రోత్సహిస్తాం -మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా వేరు శనగకు డిమాండ్ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంల రాష్ట్రంలో వేరుశనగ పంట సాగును పెంచుతామని వెల్లడించారు. నల్లగొండ పర్యటనలో భాగంగా చిట్యాలలోని రైతు సత్తిరెడ్డి పొలంలో వంకాయ పంటసాగును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3లక్షల 75 వేల ఎకరాల్లో పంట సాగవుతున్నదని చెప్పారు. త్వరలో …
Read More »ధరణితో రైతుల సమస్యలు పరిష్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఆధారంగా పెండింగ్ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్యాయి. అదనంగా రూపాయి చెల్లించాల్సిన, ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండానే ప్రక్రియ పూర్తవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ జరిగి మ్యుటేషన్ చేసుకోని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లతో భూ వివాదాలు తలెత్తేవి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గతేడాది నవంబర్ చివరి వారంలో ధరణి …
Read More »రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం- ఆ పథకంలో చేరితే రూ.15లక్షలు
వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం కల్పిస్తోంది. పీఎం కిసాన్ FPO యోజన పథకం ద్వారా రైతులు అగ్రికల్చర్ బిజినెస్ ప్రారంభించడానికి కేంద్రం రూ. 15లక్షలు అందించనుంది. ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవడానికి 11 మంది రైతులు ఒక సంస్థను ఏర్పాటు చేసి.. దానిని కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. త్వరలోనే ఈ పథకం రిజిస్ట్రేషన్, విధివిధానాలను కేంద్రం ప్రకటించనుంది.
Read More »