Politics రాజ్య సభలో ప్రధాన మోడీ ప్రసంగించిన వీడియోలను రికార్డ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రజిని అశోక్ రావు. అయితే ఇందుకు గాను ఆమెను రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు..
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో గురువారం ప్రసంగించారు. అయితే ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మొత్తం విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ రజిని పార్టీ రికార్డ్ చేయడమే కాకుండా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే సభా కార్యక్రమాలను రికార్డ్ చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ ను రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు.. ప్రవర్తన సరిగా లేని కారణంగా బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆమెను సస్పెండ్ చేసినట్టు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్ పేర్కొన్నారు..
అనుమతి లేకుండా రాజ్యసభ ప్రసంగాన్ని రికార్డు చేయడమే కాకుండా వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయంపై సీరియస్ అయ్యారు ఉపరాష్ట్రపతి. అంతేకాకుండా ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించడంతో పాటు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీతో దర్యాప్తు చేయిస్తామని చెప్పుకొచ్చారు.. అలాగే రాజ్యసభ చైర్మన్ జగదీప్.. ఇది అనారోగ్యకరమైన చర్య అని పేర్కొన్నారు. అలాగే ఈ విషయంపై ఇప్పటికే పలువురు నేతలు అశోక్ రావు పై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రాథమిక నిబంధనలు సైతం తెలియకుండా రాజ్యసభకు ఎలా వస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు అయితే ఈ విషయం తీవ్ర స్థాయికి వెళ్లే విధంగానే కనిపిస్తుంది దీనిపై ముందు ముందు దర్యాప్తుల సైతం జరిగే అవకాశం ఉంది..