KTR: హనుమకొండ స్టేషన్ ఘన్‌పూర్ లో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భాజపా…. రాష్ట్రానికే కాదు దేశానికే పట్టిన దరిద్రమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ 8 ఏళ్ల పాలనలో కేంద్రం మాటలు తప్ప తెలంగాణకు చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసి 15 లక్షల రూపాయలు జమచేస్తామన్న మోదీ…..ఇంత వరకు దాని జాడే లేదని విమర్శించారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి…….ఆదానీ, అంబానీల ఆదాయం పెరిగిందని ఆరోపించారు. వాళ్ల …ఆదాయం పెరిగితే…….ప్రభుత్వాలను కూల్చడానికి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బులు ఇస్తారని….అందుకే వాళ్ల ఆస్తులు పెంచుతున్నారని విమర్శించారు. కాజిపేటకు కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన వర్సిటీ, నవోదయ విద్యాలయాలు, కొత్త వర్సిటీలు, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇవ్వనందుకు దేవుడా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ప్రభుత్వాలను పడగొట్టడం తప్ప…..మరొక యావ లేదని ధ్వజమెత్తారు. భాజపా నేతలంతా…….మోదీ దేవుడని గొప్పలు చెప్తారు. సిలెండర్ ధర పెంచడం వల్ల దేవుడా,,,, పెట్రోల్ రేట్లు పెంచినందుకా…రైతులను చంపించడం వల్ల దేవుడా అని కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ చర్యలకు, బెదిరింపులకు ఎవరూ భయపడరని కేటీఆర్ అన్నారు. అసలు ప్రధాని గురించి చెప్పాలంటే…….ప్రజా వ్యతిరేక చర్యలపై ప్రశ్నిస్తే మనపైనే దాడులు చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని దేశంపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.
భాజపా తీరుకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. వాళ్లు ఎంతకి తెగిస్తే….మేం కూడా అంతకి తెగిస్తామని స్పష్టం చేశారు. జైలుకే వెళ్లి వచ్చినవాళ్లం….ఎవరికీ భయపడమని హెచ్చరించారు.