ప్రముఖ సినీ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోలకు క్షమాపణ చెప్పారు. ఒకవైపు ఏపీ రాజకీయాల్లో .. మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .
ఈ క్రమంలో కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఉపేంద్ర, సుధీప్ లు ప్రధాన పాత్రలుగా నటించిన కబ్జా మూవీ ఆడియో ఫంక్షన్ వేడుకలకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు.
అయితే పవన్ కళ్యాణ్ వరుస కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ ఆ వేడుకలకు వెళ్లలేక పోతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ వరుస కార్యక్రమాలతో బిజీగా ఉన్నాను.. అందుకే నేను రాలేకపోతున్నాను. పలు సినిమాల్లో మీరిద్దరూ నటిస్తున్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ అన్నారు.