‘వినయ విధేయరామ’ తరువాత శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో మరోసారి కైరా అద్వాణీ రామ్ చరణ్ తో కలసి నటిస్తోంది. “చరణ్ కలిసి మరోసారి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.
తను మంచి నటుడు. అద్భుతమైన డాన్సర్. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. కానీ.. తనలో ఎలాంటి మార్పూ లేదు. వీలైతే ప్రతీ యేడాది కనీసం ఒక్క తెలుగు సినిమాలో అయినా నటించాలని వుంది” అని కైరా చెప్పుకొచ్చింది.