బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఇంట్లో విషాదం నెలకొంది. మాధురీ దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్ కాసేపటి క్రితం ముంబైలో మృతి చెందారు. ముంబై వర్లీలో ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో బాలీవుడ్ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా స్నేహలతకు మాధురీ దీక్షితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
