వడగళ్లు ఎలా ఏర్పాడతాయో తెలుసా..తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన క్యుములోనింబస్ మేఘాలు ఉన్నప్పుడు వడగళ్లు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది.
ఈ మేఘాలు ఎక్కువ ఎత్తుగా, నిలువుగా ఉంటాయి. మేఘంలో 0 డిగ్రీ సెల్సియస్ వద్ద సూపర్ కూల్డ్ వాటర్ ఏర్పడుతుంది. దీనికి దుమ్ము రేణువులు, వర్షపు బిందువులు కలిసినప్పుడు మంచు ముక్కలు తయారవుతాయి.
అప్పుడే వడగళ్ల వాన పడుతుంది. ఇవి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి. చాలావరకు భూమికి చేరేలోపే కరిగిపోతాయి.