Home / MOVIES / సరికొత్త పాత్రలో ఫరియా అబ్దుల్

సరికొత్త పాత్రలో ఫరియా అబ్దుల్

చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించిన జాతిరత్నాలు చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నాయిక ఫరియా అబ్దుల్లా. ఆమె మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించిన సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, దక్ష నగార్కర్‌, పూజిత పొన్నాడ, సుశాంత్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు.

అభిషేక్‌ నామా నిర్మాత. సుధీర్‌ వర్మ దర్శకుడు. ఏప్రిల్‌ 7న విడుదలకానుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలు తెలిపింది నాయిక ఫరియా అబ్దుల్లా. ఆమె మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో కనకమహాలక్ష్మి అనే లాయర్‌ పాత్రలో కనిపిస్తాను.‘జాతిరత్నాలు’ చిత్రంలోని లాయర్‌ తరహా పాత్ర కాదు. తనొక ఇల్లాలు. ఇందులో సీరియస్‌గా ఉంటుంది.

హావభావాల్లో పరిణితి ప్రదర్శించా. నటించేందుకు ఆస్కారమున్న క్యారెక్టర్‌ ఇది. రవితేజ నాకు సీనియర్‌ లాయర్‌ పాత్రలో నటించారు. కథతో పాటు నా పాత్ర మారుతుంటుంది. నా కెరీర్‌ ఎలా ఉండాలి అనే అవగాహన ఉంది. అవకాశాలు రావేమో అనే భయం నాలో లేదు. దర్శకత్వం, నిర్మాణం చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. యాక్షన్‌, పీరియాడిక్‌ మూవీస్‌ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో ఒక్కో సినిమాలో నటిస్తున్నాను’ అని చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri eburke.org deneme bonusu veren siteler casino casino siteleri bahis siteleri takipçi satın al casino siteleri bahis siteleri